అతిలోక సుందరి నింగి విడిచిన వేళ, మా ఈ అశ్రునివాళి !!!

0
6118

ఆమ్మ బ్రహ్మ దేవుడో..కొంప ముంచి నావురో!!!

జాము రాతిరి జాబిలమ్మ మనకందరికీ జోల పాడి వెళ్లిపోయింది. ఆకుల మాటున దాగి తడిచిన అందాలు ఇప్పుడు కళ్ళను తడుపుతున్నాయి..ఇక అందమా అందుమా అని పాడినా సిరిమల్లె పువ్వు ఇప్పుడు వాడిపోయింది.

వసంత కోకిలై అబ్బురపరిచినా, అతిలోక సుందరి లా మెప్పించినా, క్షణక్షణాన అమాయకత్వం తో ఆకట్టుకున్నా, పలు భాషల్లో నటించి యావత్ భారతదేశాన్ని ఔరా అని మంత్ర ముగ్థులను చేసిన ఆ శృంగారి, వయ్యారి, హావభావ మయూరి, బాలనటి గా నడక ప్రారంభించి తన ముద్దు ముద్దు మాటలతో అందరి అభిమానం చూరగొని నాయిక గా నలుదిశలా కీర్తి పతాకాన్ని ఎగురవేసి ఇంతలోనే అనంత లోకాలకు తరలిపోయిన మహానటి, భారతదేశపు చాందిని శ్రీదేవి కి  ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here